AP: రాష్ట్ర వ్యాప్తంగా నేడు(మంగళవారం) పెట్రోల్ బంకుల వద్ద వైసీపీ నిరసనలు చేపట్టనుంది. రాష్ట్రంలో నెలకొన్న ఇంధన కొరతకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. డీజిల్ అందుబాటులో లేక వరి కోతలు ఆగిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఇంధన నిల్వలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.