AP: వైసీపీ నేత కారుమూరు వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి అనంతపురం జిల్లా గుంతకల్లుకు తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం నుంచి ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నారు. వెంకటరెడ్డికి మద్దతుగా గుంతకల్లు డీఎస్పీ ఆఫీస్ వద్దకు వైసీపీ నేతలు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, ఎమ్మెల్సీ శివగామిరెడ్డి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తదితరులు అక్కడికి చేరుకుని నిరసనకు దిగారు.