AP: అనంతపురంలో బీసీ గళం పేరుతో వైసీపీ సభ ఏర్పాటు చేసింది. అనంతపురం నగరంలోని లలిత కళా పరిషత్‌లో రాయలసీమ జిల్లాల బీసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, భరత్ హాజరయ్యారు. బీసీలకు చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, బీసీలకు చంద్రబాబు వెన్నుపోటుపై గళం వినిపించనున్నట్లు సీమ జిల్లాలకు చెందిన బీసీ ప్రతినిధులు తెలిపారు.