AP: జమ్మలమడుగులో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన సతీమణి ఇందిరా దీక్షలో కూర్చోగా.. ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి దీక్షా శిబిరానికి చేరుకుని విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. కాగా, డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.