మంగళగిరిలో వైసీపీ వ్యూహాలు: లోకేశ్ కు చెక్ పెట్టేదెవరు?

AP: మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ తన పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత ఎన్నికల్లో 91 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన లోకేశ్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు వైసీపీ బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డిని కొత్త ఇంచార్జిగా నియమించింది. ఇది గత మూడేళ్లలో ఐదోసారి ఇంచార్జి మార్పు. రాజధాని అమరావతి పరిధిలో ఉండటం, ముఖ్య నాయకుల నివాసాలు, పార్టీ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉండటంతో మంగళగిరి రాజకీయాలు రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తరచూ ఇంచార్జిలను మార్చడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా, అధికార పార్టీ దూకుడును అడ్డుకునేందుకే ఈ మార్పు అని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕