AP: శ్రీసత్యసాయి జిల్లా, అమడగూరు మండలం మహమ్మదాబాద్‌లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాల శ్రీనివాసులను టీడీపీ నేతలు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి ఓర్వలేక, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనుచరులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పుట్టపర్తి సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు.