మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు వైసీపీ షాక్!

AP: YCP పార్టీకి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు వైసీపీ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆయన వల్ల నెల్లూరు జిల్లాలో పార్టీకి నష్టం జరిగిందని, గత ఎన్నికలకు ముందు పలువురు బలమైన నాయకులు పార్టీని వీడటానికి ఆయనే కారణమని ఆరోపణలున్నాయి. దీంతో ఆయనను పార్టీ నుంచి పక్కన పెట్టాలని మాజీ సీఎం జగన్ ఆలోచిస్తున్నారని రాజకీయా వర్గాల్లో చర్చ నడుస్తోంది. 2019లో అధికారంలోకి వచ్చాక అనిల్ కుమార్ యాదవ్‌కు జగన్ ప్రాధాన్యత ఇవ్వడంతో, ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలను పట్టించుకోలేదని టాక్. దీంతోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయారని సమాచారం.

సంబంధిత పోస్ట్