AP: పార్లమెంటులో బుధవారం ప్రవేశపెట్టే రాజధాని అమరావతి బిల్లుపై చర్చలో వైసీపీ పాల్గొననుంది. ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. ‘ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు మేం వ్యతిరేకం కాదు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలు పరిరక్షించాలి. రైతులకు ప్రయోజనాలు చేకూర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని వైసీపీ పేర్కొంది. మరోవైపు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను టీడీపీ ఎంపీలు కలిశారు.