AP: కూటమి ప్రభుత్వం పింఛన్‌లు రద్దు చేసిందని.. కోత విధించిందని వచ్చిన ఆరోపణలపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. వైసీపీ ట్వీట్‌పై క్లారిటీ ఇచ్చింది. పింఛన్లు రద్దు అవుతున్నాయని సమాచారం తప్పు అని తెలిపింది. ఈ నెల 8,000 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయబడ్డాయని, కూటమి ప్రభుత్వం గత ఏడాదిన్నరలో పింఛన్ల కోసం రూ.50,763 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. డిసెంబరులో 63.25 లక్షల మంది పెన్షనర్లకు రూ.2,739 కోట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హెచ్చరించింది.