నేడు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

AP: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రీజనల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు హాజరుకానున్నారు. సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజాసమస్యలపై పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ చర్చించనున్నారని పార్టీ తెలిపింది.

సంబంధిత పోస్ట్