AP: కృష్ణా జిల్లా, గన్నవరం జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అనగాని రవి విజయం సాధించారు. సుమారు 5 గంటల పాటు కొనసాగిన ఉత్కంఠభరితమైన హైడ్రామా అనంతరం, కూటమి తరపున పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి చిగురుపాటి కుమారస్వామిపై 63 ఓట్ల స్వల్ప తేడాతో రవి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఫలితం యార్లగడ్డ వెంకట్రావుకు భారీ షాక్ ఇచ్చింది. గన్నవరంలో ఇటీవల చురుగ్గా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కృషి ఈ గెలుపు వెనుక ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది.