AP: కృష్ణా జిల్లాలో జరిగిన 'పరిషత్' ఫలితాల్లో YCP సత్తా చాటింది. గన్నవరం మండలం అర్జంపూడి సెగ్మెంట్ MPTC అభ్యర్థి ఈదులమూడి విజయ్ తన కూటమి ప్రత్యర్థిపై 171 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. అలాగే, అవనిగడ్డ మండలం ఎడ్లలంకలో వైసీపీ అభ్యర్థి బందెల రాముడు 11 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అటు నూజివీడు-కృష్ణారావుపాలెం, నర్సీపట్నం - చెట్టుపల్లి ఎంపీటీసీలు కైవసం చేసుకుంది. మరోవైపు, మార్కాపురం పుల్లలచెరువు జడ్పీటీసీ, గూడూరు ఎంపీటీసీ పోస్టల్ బ్యాలెట్లలో కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్లు సమాచారం.