AP: మన్యం జిల్లా కురుపాం బాలికల గురుకుల పాఠశాలలో 60 మంది విద్యార్థినులకు పచ్చ కామెర్లు, విష జ్వరాలు వ్యాపించాయి. వారం రోజుల వ్యవధిలో 10వ తరగతి చదువుతున్న అంజలి, కల్పన మృతి చెందారు. మెరుగైన వైద్య చికిత్స కోసం 19 మంది విద్యార్థినులను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. కురుపాం గ్రామంలో నీటి నమూనాలను సేకరించి టెస్టులకు పంపించారు. పాఠశాలల్లో మంచి వసతులు కల్పించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు నిరసనకు దిగారు.