AP: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. సునీత అనే మహిళను నాగరాజు అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. నాగరాజును స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నాగరాజు చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.