AP: కాకినాడ జిల్లాలోని పెద్దాపురం పట్టణానికి చెందిన కుసుమ ఎలీషా (20) అనే యువకుడు ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎలీషా ఒక హోటల్‌లో పనిచేస్తుండగా, రంగంపేట మండలం దొంతమూరుకు చెందిన ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమను ఇరు కుటుంబాల వారు అంగీకరించకపోవడంతో ఎలీషా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో తన తల్లి పనిచేస్తున్న కోళ్ల ఫారంలో ఉరేసుకుని చనిపోయాడు.