AP: విశాఖ జిల్లా చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఆ సమయంలో ఓ అపరిచిత వ్యక్తి అనుమానాస్పదంగా వ్యవహరించాడు. స్కూల్‌లోకి ప్రవేశించిన యువకుడు బాలికల వాష్‌రూమ్ వద్ద వెకిలి చేష్టలకు పాల్పడుతుండటాన్ని విద్యార్థినులు గమనించారు. వెంటనే వారు ప్రిన్సిపల్‌కు సమాచారం అందించారు. ప్రిన్సిపల్ తక్షణమే పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.