AP: బాపట్ల జిల్లా చీరాలకు సమీపంలోని బీచ్‌లో పెను ప్రమాదం తప్పింది. సముద్రంలో ఈతకు వెళ్లిన అఖిలేష్ (17) అనే యువకుడు అలల ఉధృతికి నీటిలో కొట్టుకుపోయాడు. ఈ ప్రమాదాన్ని గమనించిన కారంచేడు ఎస్ఐ తక్షణమే మెరైన్ పోలీసులను అప్రమత్తం చేశారు. దాంతో మెరైన్ కానిస్టేబుల్ ఏడుకొండలు, ఈతగాళ్లు ప్రాణాలకు తెగించి సముద్రంలోకి దూకారు. యువకుడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.