ఇంట్లో ఉరేసుకొని యువతి ఆత్మహత్య

AP: నెల్లూరు జిల్లా, ఇందుకూరుపేట మండలం నర్సాపురం గ్రామంలో మారుబోయిన నికిత అనే యువతి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాళ్ల నరాలు బలహీనపడటం, విపరీతమైన కాళ్ల నొప్పులను భరించలేకే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో మృతురాలి అక్క కల్పన ఘటనా స్థలానికి చేరుకోగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్