AP: ఏలూరులోని బ్యాంకులో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న పెదవేగి మండలం వేగివాడ గ్రామానికి చెందిన చిత్తూరు సాయి శిరీష అదృశ్యమైన ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమె పోలవరం కుడి కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు అంకన్నగూడెం లాకుల వద్ద మృతదేహం లభ్యమైంది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పెదవేగి పోలీసులు, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు.