ఇంజెక్షన్ వికటించి యువతి మృతి (వీడియో)

AP: కర్నూలులో విషాదం చోటు చేసుకుంది. కల్లూరుకు చెందిన అనిత (25) రెండు రోజుల క్రితం జ్వరంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. వైద్యులు ఆమెకి ఇంజెక్షన్ రాసిచ్చారు. దాన్ని తెలిసిన ఆర్ఎంపీతో వేయించుకున్నారు. ఇంజెక్షన్ వేయించుకున్న కొద్దిసేపటి తర్వాత అస్వస్థతకు గురికావడంతో అనితను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. ఇంజెక్షన్‌తోనే అనిత మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలోని సామగ్రిని ధ్వంసం చేశారు.

సంబంధిత పోస్ట్