రొట్టెల పండుగకు వెళ్తుండగా యాక్సిడెంట్.. యువతి మృతి

AP: నెల్లూరు జిల్లా, సంగం మండలం తరుణవాయి వద్ద హైవేపై లారీ ఢీకొనడంతో టాటా ఏస్ వాహనంలో ప్రయాణిస్తున్న యాత్రికుల్లో ఒక యువతి మృతి చెందగా, మరొక యువతికి తీవ్ర గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా నుంచి నెల్లూరు రొట్టెల పండుగకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన యువతిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ పరారవగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్