పిల్లలను కనడానికి యువత ఇష్టపడట్లేదు: చంద్రబాబు

AP: జనాభా పెంపుపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘పిల్లలను కనడానికి ప్రస్తుతం యువత ఇష్టపడట్లేదు. దీనికి అనేక కారణాలున్నాయి. ఖర్చులు పెరగడం, ఆదాయం లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా పెరుగుదల చాలా అవసరం. జనాభా ఎక్కువ ఉన్న దేశాలపైనే ఇప్పుడు ఆధారపడే పరిస్థితి వచ్చింది.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్