AP: విశాఖ బీచ్ రోడ్డులో ‘స్టాప్ వైజాగ్ డేటా సెంటర్’ పేరుతో స్థానిక పౌరులు, యువత సోమవారం ఉదయం ఆందోళన చేపట్టారు. డేటా సెంటర్ తమకు వద్దంటూ నినాదాలు చేశారు. ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో యువతకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ‘సార్.. ఇది పీస్‌ఫుల్ ప్రొటెస్ట్.. డేటా సెంటర్ మాకొద్దు’ అంటూ యువత పోలీసులతో మాట్లాడారు.