AP: ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ బస్సు తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదేనని హోంమంత్రి అనిత అన్నారు. శనివారం గుంటూరులోని కేఎల్‌యూలో ఇంజినీరింగ్ మొదటి విడత ఫలితాలను హోంమంత్రి అనిత విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత డ్రగ్స్‌కి దూరంగా ఉండాలని సూచించారు. ఉన్నత విద్యను అభ్యసించి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.