ఏపీ హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్‌ జోసెఫ్‌

AP: తనపై పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసు కింద విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని యూట్యూబర్ జోసెఫ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే అన్ని కేసులను సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం, డీజీపీ, ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాల ఎస్పీలు, పాయకరావుపేట, పిఠాపురం, మచిలీపట్నం, సర్పవరం SHOలు ప్రతివాదులుగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్