AP: పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రశ్న రావణ్ ను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం రావణును మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల నాయకులు పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.