AP: మంగళగిరి నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ కొత్త సమన్వయకర్తగా బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డిని నియమించింది. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన దొంతిరెడ్డి వేమారెడ్డిని తప్పించారు. ఈ మార్పు మంగళగిరి వైఎస్సార్‌సీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.