ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు మాజీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. కీలకమైన ఫైనల్‌లో 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన తెలుగు తేజం తిలక్ వర్మకు ప్రత్యేకంగా అభినందనలు చెప్పారు. ఫైనల్‌లో తిలక్ వర్మ ప్రదర్శించిన పోరాట పటిమ అభినందనీయమని, ఆయన అద్భుత ప్రదర్శన తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఆసియా కప్ విజయంతో దేశానికి మరో చిరస్మరణీయ విజయాన్ని అందించారని అన్నారు.