ప్రధాని మోదీకి వైఎస్‌ జగన్‌ అభినందనలు

బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి  మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పాతికేళ్ల పాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నందుకు ఆయనను అభినందించారు. ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేసిన సందేశంలో, పాలనాధిపతిగా విశిష్ట సేవలందిస్తూ 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు మోదీకి అభినందనలు తెలిపారు. దేశ సేవలో ఆయన అంకితభావం, పట్టుదల, నిబద్ధతను ప్రతిబింబించే గొప్ప మైలురాయి ఇది అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్