AP: వైఎస్ జగన్‌పై సీఎం చంద్రబాబు నాయుడు కాలం చెల్లిన వ్యూహాలతో రాజకీయం చేస్తున్నారనే విమర్శ వెల్లువెత్తుతోంది. మంచి పరిపాలన ఇవ్వాలని ఏపీ ప్రజలు అపరిమిత అధికారాన్ని బాబు నేతృత్వంలోని కూటమికి కట్టబెట్టారు. ఇప్పటికి ఏడాది పాలన పూర్తయ్యింది. ఇంకా నాలుగేళ్ల సమయం వుంది. ఏడాదిలో ఫలానా మంచి పనులు చేశామని ధీమాగా చెప్పుకోడానికి బహుశా సీఎం వద్ద బలమైన అంశాలేవీ లేనట్టున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.