AP: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుక్రవారం బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. మన ఆలోచనలను సరిచేసుకుంటే జీవితం మారుతుందని, గౌతమ బుద్ధుడు ప్రపంచానికి అందించిన సందేశం ఇదేనని ఆయన పేర్కొన్నారు. గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.