ప్రజలను కలిసిన వైఎస్ జగన్ (వీడియో)

తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో వైసీపీ అధినేత జగన్ మమేకమయ్యారు. ఓ పిల్లాడికి ఆత్మీయంగా ముద్దు పెట్టారు. కొంతమంది మాజీ సీఎంతో సెల్ఫీలు తీసుకున్నారు. పలువురు తమ సమస్యలను జగన్‌కు విన్నవించారు. ఎవరూ అధైర్య పడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా కల్పించారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కార్యకర్తలతో అన్నారు. దీనికి సంబందించిన వీడియోను వైసీపీ ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్