AP: వైఎస్సార్ కడప కార్పొరేషన్ నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం భేటీ అయ్యారు. కార్పొరేషన్ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నామినేషన్ల సందర్భంగా టీడీపీ దాడులు, బెదిరింపులపై జగన్ ఆరా తీశారు. ఎన్నికల బరిలో నిలిచిన పార్టీ అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. మేయర్ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి గెలుపునకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.