వచ్చే ఏడాది జులై 8 నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర?

AP: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి పాదయాత్ర చేపట్టేందుకు ముహూర్తం ఖరారైనట్లు జాతీయ మీడియా సంస్థ ‘IANS’ వెల్లడించింది. వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది జూలై 8 నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. 2027 నుంచి పాదయాత్ర చేస్తానని జగన్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించినప్పటికీ, నిర్దిష్ట తేదీ ప్రచారంలోకి రావడం ఇదే తొలిసారి. గతంలో 2017లో చేసిన పాదయాత్రతోనే వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్

✕
✕