AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రజా సమస్యలు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన మాట్లాడనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై ఆయన విమర్శలు గుప్పించే అవకాశం ఉంది.