రేపు, ఎల్లుండి కడప జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన మంగళవారం ఉ.11 గంటలకు పులివెందులకు చేరుకుని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రికి పులివెందుల నివాసంలో బస చేస్తారు. జూలై 8న ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన తర్వాత తిరుగు ప్రయాణం కానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్