AP: వైసీపీ అధినేత జగన్ మంగళవారం ఒంగోలులో పర్యటించనున్నారు. దివంగత వైసీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఉ.11 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి జగన్ బయలుదేరి ఒంగోలు చేరుకుంటారు. అక్కడ కాకుమాను రాజశేఖర్ నివాసానికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం ఒంగోలు నుంచి తిరుగు ప్రయాణమవుతారు.