AP: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరో రెండేళ్లలో అధికారంలోకి వస్తానని, అప్పుడు సీఎం చంద్రబాబు, ఎన్నికల కమిషనర్ పునేఠా, డీజీపీ హరీశ్గుప్తాతో పాటు బాధ్యులైన అధికారులందరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఖూనీ చేస్తోందని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.