AP: రాప్తాడు జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడిని వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని విమర్శించారు. చంద్రబాబు పాలనలో విద్యాలయాల్లో కూడా రక్షణ లేకుండా పోయిందని, ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని జగన్ ఆరోపించారు. గాయపడిన విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.