AP: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో విశాఖ నేతలతో వైసీపీ అధినేత జగన్ బుధవారం భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై నేతలు, కార్యకర్తలతో జగన్ చర్చించనున్నారు.