నేడు అరకు, విశాఖలో పర్యటించనున్న వైఎస్ జగన్

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆయన పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు అల్లూరి జిల్లా అరకు వ్యాలీలోని తంగుల్‌గూడా గ్రామంలో ఉన్న రాధాకృష్ణ ఆలయంలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు  విశాఖకు చేరుకుని రాణాప్రతాప్ నగర్‌లోని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సంబంధిత పోస్ట్