రేపు మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి వైఎస్ జగన్

రేపు (ఫిబ్రవరి 6) మాజీ మంత్రి జోగి రమేశ్‌ నివాసానికి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వెళ్లనున్నారు. ఇటీవల జరిగిన దాడుల్లో ధ్వంసమైన జోగి రమేశ్‌ ఇంటిని జగన్‌ పరిశీలించనున్నారు. అలాగే జోగి రమేశ్‌ను పరామర్శించనున్నారు. ఈ దాడి ఘటనపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని, బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్