AP: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 6వ తేదీన పరామర్శించనున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్ ఇబ్రహీంపట్నం బయల్దేరి, జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. టీడీపీ గూండాల దాడిలో జోగి రమేష్ కుటుంబం గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.