ఏపీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కసరత్తు వేగవంతం చేశారు. దీనిలో భాగంగా 8 మంది సభ్యులతో కూడిన రాష్ట్రస్థాయి మానిటరింగ్ కమిటీని నియమించారు. ఈ కమిటీకి సిడబ్ల్యూసి (CWC) సభ్యుడు రఘువీరారెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా, కన్వీనర్‌గా కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, సభ్యులుగా మస్తాన్‌వలి, తులసిరెడ్డితో పాటు పలువురు కీలక నాయకులకు చోటు కల్పించారు.