విజయసాయి రెడ్డి నివాసానికి వైఎస్ షర్మిల

AP: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె అంజలి వివాహానికి ఆహ్వానం పలికేందుకు ఎంపీ విజయసాయి రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్బంగా కుటుంబ సమేతంగా వివాహానికి హాజరు కావాలని ఆమె కోరారు. వైసీపీ నుండి బయటకు వచ్చి, జగన్‌పై విమర్శలు చేస్తూ కొత్త పార్టీ స్థాపన దిశగా అడుగులు వేస్తున్న విజయసాయి రెడ్డిని, కాంగ్రెస్‌లో చేరిన షర్మిల కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వీరిద్దరి భేటీ భవిష్యత్తులో జగన్‌కు వ్యతిరేకంగా పొత్తులకు దారితీస్తుందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕