విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందని డెక్కన్ క్రానికల్ పత్రికలో వచ్చిన కథనం రాజకీయ పార్టీల మధ్య ప్రచ్చన్న యుద్ధానికి కారణమైంది. డెక్కన్ క్రానికల్ పత్రికపై దాడిని జగన్ తన ఎక్స్ ఖాతా ద్వారా ఖండించారు. తాజాగా విశాఖలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై దాడిని వైయస్ షర్మిల ఖండించారు. మొన్నటిదాకా జగన్‌నే టార్గెట్ చేసిన షర్మిల ఇప్పుడు జగన్ బాటలో టీడీపీపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనతో జగన్ అభిప్రాయంతో వైఎస్ షర్మిల ఏకీభవించినట్లు రాజకీయ నిపుణులు చెబుతున్నారు.