610 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం

వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఫుడ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం తనిఖీలు జరిగాయి. రఫీ రైస్ మిల్లు సమీపంలోని గోదాములో అక్రమంగా నిల్వ చేసిన 610 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. బియ్యంతో పాటు వాహనాన్ని సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. ఈ అక్రమ నిల్వలపై నిఘా కట్టుదిట్టం చేస్తామని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్