కొత్తచెరువులో స్వచ్ఛ రథం కార్యక్రమం

వీరపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తచెరువు గ్రామంలో స్వచ్ఛ రథం వాహనం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ వద్ద ఉన్న ప్లాస్టిక్ వస్తువులను స్వచ్ఛ రథానికి అందించి, వాటికి బదులుగా నిత్యావసర సరుకులను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి పి. శ్రీనివాసులు, హరిత రాయబారులు, స్వచ్ఛ రథం ఆపరేటర్ పాల్గొన్నారు. గ్రామంలో పరిశుభ్రతను పెంపొందించేందుకు ప్లాస్టిక్ వ్యర్థాలను సక్రమంగా సేకరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్

✕
✕