బద్వేల్ వద్ద రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

గోపవరం మండలం మడకలవారిపల్లె సమీపంలో మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో బైపాస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రొద్దుటూరు నుంచి బద్వేల్ పరిసర ప్రాంతాలకు బండలు సరఫరా చేస్తూ వెళ్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న భాస్కర్ (50), రమణయ్య (60) అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన ట్రాక్టర్‌ను బద్వేల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్

✕
✕