సర్వరాయ సాగర్, వామికొండ రిజర్వాయర్లకు నీటి విడుదల

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని ముద్దనూరు మండలం శెట్టివారిపల్లె గ్రామం దగ్గర సోమవారం తెదేపా ఇన్‌చార్జ్ భూపేష్ సుబ్బారామి రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డిలు హెడ్ రెగ్యులేటర్ ద్వారా జిఎన్ఎన్ యస్ కాలువ ద్వారా 500 క్యూసెక్యూల నీటిని సర్వరాయ సాగర్, వామికొండ' రిజర్వాయర్లకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, యువ నాయకులు పుత్తా లక్ష్మిరెడ్డి, ఇరిగేషన్ అధికారులు, ఎన్డిఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్